Chaala Bagundi
Mukunda
歌手:Mickey J Meyer
专辑:《Mukunda》



పగటి కలొ .. పడుచు వలొ ..
తననిలాగే తలపులలో ..

పగటి కలొ .. పడుచు వలొ ..
తననిలాగే తలపులలో ..

చాలా బాగుంది .. అనుకుంది .. మది లోలో ..
తానేఁ చూసింది అనుకోని మలుపుల్లో
పరవశమో తగని శ్రమో అసలిది ఏమో

~ సంగీతం ~

తొలి సరదా పరుగులెడుతున్నది ఇంతలా
ఎటు పోతుందో అడిగితె చెపుతుందా
నాపైనే తిరగ బడుతున్నదె ఇంకెలా
ఆశల వేగాన్నీ .. ఆపె వీలుందా ..

తెగబడి తడబడి వడి వడి ఇదేమి అలజడో
తగుజతి కనబడి వెంటాడే ఊహలలో

చాలా బాగుంది .. అనుకుంది .. మది లోలో ..
తానేఁ చూసింది అనుకోని మలుపుల్లో

~ సంగీతం ~

అపుడెపుడో తగిలినది మనసుకు నీ తడి
అని ఇపుడిపుడే గురుతుకు వస్తోంది ..
తొలకరిలో చినుకు చెలి చేసిన సందడి
నేలకి తెలిసేలా చిగురులు వేసింది

చెలిమికి చిగురులు
తొడగగా సరైన సమయము
ఇది కదా అనుకొని ఎదురేగాలో ఏమో

చాలా బాగుంది .. అనుకుంది .. మది లోలో ..
తానేఁ చూసింది అనుకోని మలుపుల్లో
పరవశమో తగని శ్రమో అసలిది ఏమో

更多>> Mickey J Meyer的热门歌曲