Anaganaga Oka Uru (Female Version) 作词 : Chandrabose 作曲 : Anup Rubens అనగనగా ఒక ఊరు అనుకోకుండా ఒకనాడు కలిశారే పసివాళ్ళు స్నేహంగా సంతోషమంతా రెక్కలుగా రివ్వంటూ ఎగిరే పక్షులుగా ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా ఒకరేమో సీను ఒకరేమో జున్ను కలిశారే ప్రాణంగా కురిశారే వర్షంగా పాటేమో సీను ఆటేమో జున్ను ఒకటయ్యి ఎదిగారే మధురంగా ప్రపంచమంతా తమ ఇల్లంటూ ప్రతీ క్షణం ఒక పండుగగా కన్నీరు లేని కలలే కంటూ చిన్నారి చెలిమే బలపడగా తియతియ్యని ఊసులతో తెల్లతెల్లని మనసులలో కథ ఇలాగ మొదలయ్యేగా కథ ఇలాగ మొదలయ్యేగా అనగనగా ఒక ఊరు అనుకోకుండా ఒకనాడు కలిశారే పసివాళ్ళు స్నేహంగా ~ సంగీతం ~ ఎగిరిన బుడగలలోన చెలిమే ఉరికిన పడవలలోన చెలిమే రంగులరాట్నంలో చెలిమే చిందులు వేసిందే మిణుగురు వెలుగులలోన చెలిమే తొలకరి తేనెలలోన చెలిమే గాజుల గలగలలో చెలిమే సందడి చెసిందే ఈ జ్ఞాపకాలన్నీ నిలెచేనులే నీ జీవితానికి బలమై నడిపేనులే ఈ సాక్ష్యాలే అనుబంధాల భవనానికి స్తంబాలే నా నా నా నా నా నా ..... తెలపని కబురులలోన చెలిమే తిరగని మలుపులలోన చెలిమే దొరకని చేపలలో చెలిమే దోసిలి నింపింది జరిగిన నిమిషములోన చెలిమే ఎరగని మరునిమిషాన చెలిమే కాలం చెక్కిలిలో చెలిమి చుక్కై మెరిసింది చిననాడు మురిపించే ఈ గురుతులే కనరాని దారిని చూపే నీ గురువులే ఉండాలంటూ ఈ బతుకంతా మాటలకే కట్టుబడి నా నా నా నా నా నా .....